

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీడియో గేమ్ ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6’ (GTA VI) విడుదలకు ముందు గేమింగ్ ప్రియులకు కల్షి (Kalshi) సంస్థ ఓ వినూత్న ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. ‘GTA VI రీసెర్చర్’ పేరుతో రిమోట్ ఉద్యోగాన్ని అందిస్తోంది. ఈ పోస్టుకు ఎంపికైన వ్యక్తికి గరిష్ఠంగా 1,20,000 డాలర్లు (సుమారు రూ. కోటికి పైగా) చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు గేమింగ్, స్ట్రీమింగ్ కోసం 15,000 డాలర్ల బోనస్, 100 అంగుళాల టీవీ, PS5 లేదా Xbox కన్సోల్, రోజువారీ DoorDash ఫుడ్ క్రెడిట్స్, జిమ్ మెంబర్‌షిప్ వంటి సదుపాయాలను కూడా అందించనుంది.
అయితే ఈ ఉద్యోగంలో కేవలం గేమ్ ఆడితే సరిపోదు. గేమ్‌లోని కల్పిత ప్రాంతమైన లియోనిడా ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేయాలి. గేమింగ్ ప్రయాణం మొత్తాన్ని Twitch లేదా YouTube ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయాలి. అంతేకాకుండా ‘స్టేట్ ఆఫ్ ది లియోనిడా ఎకానమీ’ పేరుతో అధికారిక ప్రసంగం కూడా ఇవ్వాలి. ఎంపికైన అభ్యర్థి గేమ్ విడుదల రోజైన నవంబర్ 19, 2026న అర్ధరాత్రి నుంచే ఆడటం ప్రారంభించి, కథ పూర్తయ్యే వరకు కొనసాగించాల్సి ఉంటుంది. PlayStation 5, Xbox Series X|S కన్సోళ్లపై GTA VI విడుదల కానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!