
జనరల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించింది. క్వాక్వరెల్లీ సైమండ్స్ విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2027లో హెచ్‌సీయూ 851–900 ర్యాంక్ బ్యాండ్‌లో స్థానం సంపాదించింది. బోధన విధానాలు, పరిశోధన ప్రమాణాలను ఆధారంగా తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,500 విశ్వవిద్యాలయాలను పరిశీలించిన తర్వాత ఈ ర్యాంకులను ఖరారు చేశారు. హెచ్‌సీయూ ఫ్యాకల్టీ లో 98.1 శాతం మంది పీహెచ్‌డీ అర్హత కలిగి ఉన్నారని క్యూఎస్ సంస్థ వెల్లడించింది. ఈ గుర్తింపుపై ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జె. అనురాధ సంతోషం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!