

తెలంగాణలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నెల 29న ఢిల్లీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, గ్లోబల్ కంపెనీల సీఈవోలు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రోత్సాహక ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకానున్నారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్‌సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులను సమ్మిట్‌కు ఆహ్వానించడంతో పాటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకశాలను వివరించేందుకు ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లోని అవకాశాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తోంది. ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), ఇన్వెస్ట్ ఇండియా సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!