

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఆహార కల్తీని అరికట్టడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించని తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని 20 ఆహార తయారీ కేంద్రాలపై 10 ప్రత్యేక బృందాలు ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు కేంద్రాల్లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడ్డాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, తగిన పరిశుభ్రత లేకుండానే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ దాడుల్లో సుమారు రూ.5.89 లక్షల విలువైన 5,555 కిలోల నాసిరకం, కల్తీగా అనుమానిస్తున్న ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన తొమ్మిది ఆహార తయారీ కేంద్రాల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేసి, వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు సరిగా పాటించని మరో తొమ్మిది సంస్థలకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG-SAFETY) అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ వ్యాపారాలు, నాసిరకం ఆహార తయారీపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!