

అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు శాశ్వత నివాస హోదా కల్పించే దిశగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన నేతలు కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. బహిష్కరణ ఉత్తర్వులు ఎదుర్కొంటున్నప్పటికీ, అమెరికాలో కనీసం పదేళ్లుగా నివసిస్తున్న అర్హులైన వలసదారులకు గ్రీన్ కార్డు పొందే అవకాశం కల్పించేలా బిల్లును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. నిర్దేశిత అర్హతలు కలిగి, ఎలాంటి నేర చరిత్ర లేని వలసదారులు శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు చట్టబద్ధమైన నివాస హోదా కల్పించడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.
ఈ బిల్లులో బహిష్కరణ ఉత్తర్వులకు సంబంధించి కూడా కీలక నిబంధనలను చేర్చారు. అమెరికాలో పదేళ్లకు పైగా నివసించిన అర్హులైన వలసదారులకు సంబంధించిన కొన్ని బహిష్కరణ ఉత్తర్వుల గడువు పదేళ్ల తర్వాత ముగిసేలా ప్రతిపాదించారు. అయితే ఈ వెసులుబాటు నేర చరిత్ర లేని, నిర్దేశిత అర్హతలు కలిగిన వారికే వర్తించనుంది. ఈ ప్రతిపాదన చట్టరూపం దాలిస్తే అమెరికాలో సుదీర్ఘకాలంగా నివసిస్తున్న అనేక మంది వలసదారులకు శాశ్వత నివాస హోదా పొందేందుకు మార్గం సుగమం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!