
జనరల్

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి రెబల్ స్టార్ ప్రభాస్ తన మద్దతు ప్రకటించారు. యువత ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన ప్రోత్సహించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచడంతో పాటు, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది.

ఈ ప్రచారంలో భాగంగా నవంబర్ 25 నుంచి 27, 2026 వరకు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఈ వాక్ సాగనుంది. డ్రగ్స్ రహిత భారతదేశం కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!