

మూడు దశల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ అదనపు భద్రతా బలగాలను మోహరించాలని సూచించారు.
ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఏకగ్రీవాల వల్ల భద్రతా బలగాల అవసరం తగ్గి, వాటిని ఇతర ప్రాంతాల్లో వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మొదటి దశలో 15 నుంచి 20 శాతం వరకు ఏకగ్రీవాలు జరుగుతాయని అంచనా వేయగా, ఇప్పటికే 19 శాతం ఏకగ్రీవాలు నమోదయ్యాయని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!