

దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్‌తో పాటు మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని పేర్కొంది.
మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో రహదారి, రైలు రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం కొనసాగుతోంది. గాలినాణ్యత ఆందోళనకరంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు, ఉత్తర భారతంలో పొగమంచు, ఢిల్లీ-NCRలో కాలుష్యం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కొనసాగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!