
జనరల్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువాలీ మండలంలో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. పెదాలబుడు పంచాయతీ పరిధిలోని కరసాలుగూడ గ్రామానికి చెందిన పూజారి గోపి, డోంబుకు చెందిన ఇల్లు వర్షాల ప్రభావంతో కూలిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇల్లు కూలిన విషయం తెలుసుకున్న అరకువాలీ ఎంఆర్‌ఓ శ్రీధర్ రాజు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెదాలబుడు పంచాయతీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పూజారి లక్ష్మీపతి పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!