

హైదరాబాద్‌లోని సల్కం చెరువులో ఉన్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థల భవనంపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖలు సమర్పించిన నివేదికలో ఈ భవనం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో లేదని పేర్కొన్నాయి. అయితే మ్యాప్స్ ప్రకారం ఆక్రమణ స్పష్టంగా కనిపిస్తోందని న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఎఫ్‌టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గిందని ప్రశ్నిస్తూ అధికారులను నిలదీశారు.

ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తుల నిర్మాణాలను కూల్చకుండా వదిలేస్తుందా అని హైకోర్టు ప్రశ్నించింది. చెరువులను కాపాడుతున్నామని చెప్పుకునే హైడ్రా ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుందో కూడా వివరణ కోరింది. మున్సిపల్ శాఖ, హెచ్ఎండీఏ నుంచి నివేదికలు రాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, ఒవైసీ భవనాలపై విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను కోర్టు వెనక్కి తీసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!