
సినిమాలు

కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యామ్‌కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌కు సుమారు 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, దిగువకు ఎలాంటి నీటి విడుదల చేపట్టడం లేదు. దీంతో డ్యామ్‌లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
గత నాలుగు రోజుల్లో దాదాపు 6 టీఎంసీల నీరు డ్యామ్‌లోకి చేరినట్లు అధికారులు తెలిపారు. 105.788 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తుంగభద్ర డ్యామ్‌లో ప్రస్తుతం 15.049 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!