

కోలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్టుల్లో ధనుష్ ‘D57’ ఒకటి. గత కొంతకాలంగా ఈ సినిమాపై భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ హీరోగా నటించనుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన నటీనటులు మరియు దర్శకుడి మధ్య చర్చలు పూర్తయ్యాయని, ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోవడం ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితే, ఇది ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజీ అనౌన్స్‌మెంట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందీ సినిమాల ద్వారా గుర్తింపు పొందిన జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ‘D57’ ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!