
సినిమాలు

దక్షిణ కొరియా పర్యటనలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్‌వోడీ చో హన్ చుల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సంస్థను ఆహ్వానించారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగం రాష్ట్రానికి ప్రత్యేక బలమని లోకేశ్ వివరించారు.
భారత్‌లో తయారయ్యే ఏసీల్లో 40 శాతం, టీవీల్లో 35 శాతం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, అలాగే ఆగ్నేయాసియా మరియు మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేయడానికి ఏపీ అత్యంత అనుకూల కేంద్రంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!