
జనరల్

అమరావతిలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్–ఒడిశా తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఒడిశాలో భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున అక్కడి అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అనిత సూచించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం, జాతీయ విపత్తు స్పందన దళం బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!