28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..

Writer: Chandrika 08:02 PM, 28 నవంబర్, 2026
హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..

హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాలు, సద్గురు హెల్త్‌కేర్‌కు సంబంధించిన ఈ కేసులో కీలక నిందితుల అరెస్టుతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో సద్గురు హెల్త్‌కేర్ సంస్థకు 10 ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాలు ఉండగా.. బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లో నాలుగు లెవల్-2 ఐవీఎఫ్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ గేదెల దుర్గారావు ఆదేశాల మేరకు మియాపూర్‌లోని సద్గురు ART బ్యాంక్ ఇన్‌ఛార్జ్ సునీల్ రాయ్ ఏజెంట్లను నియమించుకుని వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు రప్పించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అండాల సేకరణ కోసం తీసుకొచ్చిన మహిళలకు అండాల ఉత్పత్తిని పెంచేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి, అనంతరం లెవల్-2 ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ కేసులో A-8గా ఉన్న సంస్థ సీఓఓ ప్రతీక్ అనిల్ గగ్లానీ 2025 నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సంస్థ కార్యకలాపాల పర్యవేక్షణ, వైద్య పరికరాలు, వసతుల ఏర్పాటు, ఆర్థిక లావాదేవీల సమన్వయం, డోనర్ ప్యాకేజీలపై రోగులకు కౌన్సెలింగ్ వంటి బాధ్యతలు అతను నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు డాక్టర్ రాజర్షి దేబ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడని, క్లినికల్ క్వాలిటీ, ఆపరేషన్ థియేటర్ల సిద్ధత, వైద్యుల నియామకాలను పర్యవేక్షించేవాడని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా సంస్థకు 43 క్లినిక్‌లు ఉన్నాయని, ప్రతి నెలా సుమారు 600 సెల్ఫ్ సైకిల్స్, 100 అండాల డోనర్ సైకిల్స్ నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. వీటి ద్వారా నెలకు రూ.27 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు వివరించారు. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. 2026 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సుమారు రూ.487.82 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రతీక్ అనిల్ గగ్లానీ నుంచి రెండు ఐఫోన్లు, డాక్టర్ రాజర్షి దేబ్ నుంచి ఒక ఐఫోన్‌తో పాటు కీలక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి:  చంద్రబాబు

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి: చంద్రబాబు

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

ట్యాగ్లు
హైదరాబాద్ వార్తలుఅక్రమ అండాల సేకరణఒయాసిస్ ఫెర్టిలిటీసద్గురు హెల్త్‌కేర్ఐవీఎఫ్ కేంద్రాలుఅండాల దందామల్కాజిగిరి పోలీసులుసుమతి ఐపీఎస్రూ.487.82 కోట్ల లావాదేవీలువైద్య రంగంలో అక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..
జనరల్

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్
క్రీడలు

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి:  చంద్రబాబు
జనరల్

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి: చంద్రబాబు

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..
జనరల్

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్
జనరల్

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్
క్రీడలు

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..
జనరల్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..
జనరల్

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..
జనరల్

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!