

ప్రతి ఏడాది ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం లభించిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలను ఎగురవేసి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహిస్తారు.
ఇక జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26న అది అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఘనమైన గణతంత్ర దినోత్సవ పరేడ్ నిర్వహిస్తారు. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల ప్రదర్శనలతో పాటు దేశ సాంస్కృతిక, సామాజిక వైవిధ్యాన్ని చాటే శకటాలు ఆకట్టుకుంటాయి. స్వాతంత్య్ర దినోత్సవం దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజుకు గుర్తుగా జరుపుకుంటే, గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా నిర్వహిస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!