
జనరల్

హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఏళ్లుగా తమ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించేందుకు కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భట్టితో అపాయింట్‌మెంట్ ఇప్పించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పట్టుబట్టారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెండింగ్ బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులు తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు ఇటీవల కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించిన సమస్యలుగా ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!