

‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ర్యాలీకి సుమారు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలన్నది కూటమి మరో ప్రధాన డిమాండ్. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొంటున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!