29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మల్లన్నసాగర్‌ కట్ట పక్కన బ్లాస్టింగ్‌లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

Writer: Shivani K 07:07 PM, 29 అక్టోబర్, 2026
మల్లన్నసాగర్‌ కట్ట పక్కన బ్లాస్టింగ్‌లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ భద్రతపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టింపు లేదా అని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోట్లాది రూపాయలతో నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కట్ట సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ బ్లాస్టింగ్‌లు ఎలా నిర్వహిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలోని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కట్టను సందర్శించిన హరీశ్‌రావు, అనంతరం పైప్‌లైన్ల కోసం నిర్మిస్తున్న ఇంటెక్‌వెల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కట్టకు సమీపంలో పెద్దపెద్ద గోతులు తవ్వి పేలుళ్లు జరుపుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

మేడిగడ్డ ప్రాజెక్టు తరహాలోనే మల్లన్నసాగర్‌ కట్టను కూడా బలహీనపరిచి ప్రాజెక్టును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌ల వల్ల రిజర్వాయర్‌ కట్టకు నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, అనుమతులు లేని బ్లాస్టింగ్‌ పనులను నిలిపివేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ కక్షసాధింపుల కోసం రైతుల భవిష్యత్తును, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రైతులు, ప్రజలను ఏకం చేసి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో కరవు లేదు.. తెలంగాణలో రేవంత్‌ వల్లే కరవు: కేటీఆర్‌

ఏపీలో కరవు లేదు.. తెలంగాణలో రేవంత్‌ వల్లే కరవు: కేటీఆర్‌

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ.. బ్యాలెట్ పేపర్లు వర్సెస్ ఈవీఎంల వివాదం!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ.. బ్యాలెట్ పేపర్లు వర్సెస్ ఈవీఎంల వివాదం!

పింఛన్ల పంపిణీపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు.. ఎన్నికల సంఘాలకు లేఖ!

పింఛన్ల పంపిణీపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు.. ఎన్నికల సంఘాలకు లేఖ!

ట్యాగ్లు
హరీశ్‌రావుమల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌బీఆర్‌ఎస్‌కాంగ్రెస్‌ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలురిజర్వాయర్‌ భద్రతఅక్రమ బ్లాస్టింగ్‌లురైతుల సమస్యలుసిద్దిపేట వార్తలుఉత్తర తెలంగాణ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అర్నబ్ తుఫాన్ బాధితులకు త్వరగా పరిహారం.. పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి!

అర్నబ్ తుఫాన్ బాధితులకు త్వరగా పరిహారం.. పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి!

కేటీఆర్‌పై గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న కొండా సురేఖ..

కేటీఆర్‌పై గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న కొండా సురేఖ..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అభివృద్ధి లక్ష్యంపై పీయూష్ గోయల్ ప్రశంసలు.. కేంద్రం పూర్తి మద్దతు
జనరల్

తెలంగాణ అభివృద్ధి లక్ష్యంపై పీయూష్ గోయల్ ప్రశంసలు.. కేంద్రం పూర్తి మద్దతు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. ఇండియా కూటమి డిమాండ్
జనరల్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. ఇండియా కూటమి డిమాండ్

టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది
బిజినెస్

టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. పలువురు మృతి
జనరల్

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. పలువురు మృతి

కర్ణాటకలో పెరిగిన పాల ధరలు.. రైతులకు భారీ ఊరట
బిజినెస్

కర్ణాటకలో పెరిగిన పాల ధరలు.. రైతులకు భారీ ఊరట

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటలకు తీవ్ర నష్టం.. భారీ నష్టాల్లో రైతులు
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటలకు తీవ్ర నష్టం.. భారీ నష్టాల్లో రైతులు

ఇంధన సరఫరాపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
జనరల్

ఇంధన సరఫరాపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

మల్లన్నసాగర్‌ కట్ట పక్కన బ్లాస్టింగ్‌లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

మల్లన్నసాగర్‌ కట్ట పక్కన బ్లాస్టింగ్‌లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
జనరల్

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..

మెగాస్టార్ చిరంజీవి టాక్ షోకు టైటిల్ ఫిక్స్
ఓటీటీ

మెగాస్టార్ చిరంజీవి టాక్ షోకు టైటిల్ ఫిక్స్

భారత్‌లోనే కాదు, పాకిస్థాన్‌లోనూ ‘రామాయణ’ సందడి
సినిమాలు

భారత్‌లోనే కాదు, పాకిస్థాన్‌లోనూ ‘రామాయణ’ సందడి

బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం.. అమెరికాలో ప్రత్యక్షమైన ఫ్లేవియో బొల్సనారో
జనరల్

బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం.. అమెరికాలో ప్రత్యక్షమైన ఫ్లేవియో బొల్సనారో