

నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఇండోనేషియాతో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, సముద్ర భద్రత వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రకారం ఇండోనేషియా భారతదేశం అభివృద్ధి చేసిన అస్త్ర గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను కొనుగోలు చేయనుండగా, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఇండోనేషియాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థల అభివృద్ధికి భారత్ సాంకేతిక సహకారం అందించనుంది.
స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ ఖనిజాల రంగాల్లో భారత పెట్టుబడులను విస్తరించేందుకు ఇరు దేశాలు చర్చించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన మలక్కా జలసంధి సమీపంలోని సబాంగ్ పోర్ట్ను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. అదనంగా, బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా, సముద్ర భద్రత, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ఈ చర్యలు భారత్-ఇండోనేషియా సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయని భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!