

తెలంగాణ హైకోర్టు సల్కం చెరువు పరిధిలో ఉన్నట్లు వివాదంలో ఉన్న ఒవైసీ విద్యాసంస్థల భవనంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తమ విద్యాసంస్థల భవనాన్ని కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కేసు తుది నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని పిటిషన్లో కోరింది.
విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది, ఆ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో ఉందని, ఇదే అంశంపై మరో ధర్మాసనం ఎదుట విచారణ కొనసాగుతోందని, కాబట్టి ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని వాదించారు. దీనికి ప్రతిగా, భవనాన్ని బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్ఎస్) కింద క్రమబద్ధీకరించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని యాజమాన్యం కోర్టుకు తెలిపింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు భవనంపై స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!