
సినిమాలు

మహేంద్ర సింగ్ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో మాజీ భారత కెప్టెన్ ధోనికి 77 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ క్రికెట్ అభిమానులను, స్థానిక ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. ధోనిపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఇది మరో నిదర్శనంగా నిలిచింది.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది. ధోని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అక్కడ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ధోనిపై అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!