

అమెరికాలో జీవితం అంటే అధిక జీతం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదని రుపేశ్ పాండే అనే భారతీయుడు చెబుతున్నాడు. రోజువారీ జీవితంలో లభించే చిన్న చిన్న సౌకర్యాలు, జీవన నాణ్యతపై ఎక్కువ ప్రభావం చూపుతాయని తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇంటి నుంచి ఐదు నిమిషాలు నడిస్తే చాలు. పార్కులు, ఆట స్థలాలు, ప్రశాంతమైన రోడ్లు అందుబాటులో ఉంటాయని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో చూపించాడు. తన అపార్ట్మెంట్ ప్రాంగణంలోనే బాస్కెట్బాల్ కోర్టు, సమీపంలో లాన్ టెన్నిస్ కోర్టు, పిల్లలు చేపలు పట్టే చెరువు ఉన్నాయని వివరించాడు.
ఈ సౌకర్యాల కంటే వాటితో ముడిపడిన జీవన విధానమే తనను ఎక్కువగా ఆకట్టుకుంటోందని పాండే పేర్కొన్నాడు. సాయంత్రం పార్కులో చేపలు పట్టడం, ఎప్పుడైనా టెన్నిస్, బాస్కెట్బాల్ ఆడటం, ప్రశాంతమైన రోడ్లపై కుక్కను తీసుకుని నడవడం, కాలుష్యం గురించి పెద్దగా ఆలోచించకుండా స్వచ్ఛమైన గాలి పీల్చడం తన దైనందిన జీవితంలో భాగమయ్యాయని చెప్పాడు. ఇలాంటి జీవన విధానానికి అలవాటుపడిన తర్వాత తిరిగి భారత్కు వెళ్లడం సులభంగా అనిపించదని, కొన్ని సందర్భాల్లో డబ్బు కంటే జీవన నాణ్యతకే ఎక్కువ విలువ ఉంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!