
జనరల్

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. బలమైన ప్రకంపనలతో ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడటంతో పాటు కొన్ని నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. రోడ్లపై శిథిలాలు కనిపించాయి.
భూకంపం నేపథ్యంలో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసి అధికారులు సముద్ర మట్టాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా పూర్తి స్థాయి నష్టంపై అధికారికంగా స్పష్టమైన సమాచారం వెలువడలేదు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!