
గాసిప్స్

కర్ణాటకలో అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న 13,675 మంది విదేశీయులను రాష్ట్ర హోంశాఖ గుర్తించింది. వీరిలో అత్యధికంగా 10,652 మంది బెంగళూరులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధృవీకరణ ప్రక్రియలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అధికారిక గణాంకాల ప్రకారం మైసూరులో 1,155 మంది, మంగళూరులో 431 మంది, బెలగావిలో 234 మంది, శివమొగ్గలో 171 మంది, హుబ్బಳ್ಳಿ-ధారవాడలో 148 మంది గుర్తించబడ్డారు. పోలీసులు, విదేశీయుల నమోదు కార్యాలయం మరియు ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు కొనసాగుతున్నాయి. ధృవీకరణ అనంతరం చట్టపరమైన చర్యలు, అవసరమైతే దేశ బహిష్కరణ చేపడతామని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!