
జనరల్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మొహంతి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఆహారం, ఔషధాల నాణ్యత ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి టీజీ సేఫ్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌గా ఏర్పాటైన ఈ సంస్థకు అవినాశ్ మొహంతి డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!