

ఐవీఎఫ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో అరెస్టయిన నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న మరికొన్ని ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పలువురు నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఏడు ఐవీఎఫ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో అండాల సేకరణకు సంబంధించి పలు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. రక్త గ్రూప్, మతం, చర్మం రంగు వంటి అంశాల ఆధారంగా మహిళల నుంచి అండాలను సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సేకరించిన అండాల నాణ్యత సరిపోలేదనే కారణంతో అబార్షన్లు చేయించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు, ఇందులో ప్రమేయం ఉన్నవారి పాత్ర విచారణలో తేలాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!