

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ‘కెప్టెన్స్ కార్నివల్’ కార్యక్రమంలో ఐసీసీ చైర్మన్ జయ్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు టోర్నీలో పాల్గొనే 12 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా జయ్ షా అన్ని జట్ల కెప్టెన్లను అభినందిస్తూ కలుసుకున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో ఆయన కరచాలనం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై భారత్, పాకిస్థాన్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పాకిస్థాన్ అభిమానులు గతంలో భారత్ అనుసరించిన ‘నో హ్యాండ్ షేక్’ విధానాన్ని ప్రస్తావించగా, భారత అభిమానులు మాత్రం జయ్ షా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా అన్ని జట్లను సమానంగా గౌరవించడం ఆయన బాధ్యత అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మహిళల టీ20 ప్రపంచకప్ జూన్ 12న ప్రారంభం కానుండగా, భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!