
జనరల్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తమ పోరాటం ఆగదని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, అయితే కేవలం రాజీనామా సరిపోదని స్పష్టం చేశారు. అన్ని డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
దీప్కే రెండు ప్రధాన డిమాండ్లు ఉంచారు: మొదటిది, నీట్ అంశంతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలి. రెండవది, 20వ తేదీ నిరసనల్లో అతిగా స్పందించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "గుర్తుంచుకోండి, కాక్రోచ్‌తో గొడవ పడొద్దు" అంటూ సీజేపీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!