
ఆరోగ్యం

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత పురుషుల టీ20 జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో బరిలోకి దిగనుంది. విడుదలైన షెడ్యూల్ ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
మొదటి రౌండ్‌లో అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్, జపాన్, మలేసియా, నేపాల్, ఒమన్ జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడతాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. భారత్ సెప్టెంబర్ 28న తన తొలి మ్యాచ్ ఆడనుంది. మహిళల టోర్నీ కూడా క్వార్టర్ ఫైనల్స్ నుంచే ప్రారంభం కానుండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలి మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!