

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన కొత్త నివాసం ‘గంగ’లో గురువారం ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి సుమారు 200 మంది హాజరయ్యారు. రాష్ట్రంలోని చట్టసభ ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. వారిలో పలువురు విందులో పాల్గొని భోజనం చేశారు.
అయితే, ఈ విందుకు పలువురు ప్రముఖులు గైర్హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీవీ విజయేంద్రతో పాటు భాజపా, జేడీఎస్ నేతల్లో చాలామంది కార్యక్రమానికి హాజరుకాలేదు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా కొందరు మంత్రులు కూడా విందుకు దూరంగా ఉన్నారు. వివిధ రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ విందు సందడిగా సాగింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!