

కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం రూ.16,000 కోట్ల నిధులను విడుదల చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రహదారి కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 15,000 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.10,000 కోట్లు కేటాయించగా, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం మరో రూ.6,000 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇతర ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ సందర్భంగా సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ, విడుదల చేసిన నిధులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కాదని, ప్రజా సంక్షేమ పనుల కోసమే వినియోగించాలని స్పష్టం చేశారు. చేపట్టే ప్రతి పనిలో నాణ్యత, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని అధికారులను హెచ్చరించారు. అలాగే చెరువులు, కుంటల ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!