
గాసిప్స్

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 13 మంది నిందితులపై సుమారు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. సీబీఐ సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిందితులపై ఆరోపణలు నమోదు చేయాలా అనే అంశంపై రేపు వాదనలు జరగనున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే ప్రశ్నపత్రం లీక్ చేశారని సీబీఐ ఆరోపించింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలను పొందుపరిచినట్లు తెలిపింది. పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుల పాత్ర, ప్రశ్నపత్రం లీక్ అయిన తీరు, దీనికి సంబంధించిన ఆధారాలపై దర్యాప్తు సంస్థ వివరాలను సమర్పించింది. నిందితులపై ఆరోపణల నమోదుపై కోర్టులో జరిగే తదుపరి విచారణ ఈ కేసులో కీలకంగా మారనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!