
సినిమాలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. యాదాద్రి తెలంగాణలోని ప్రముఖ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఉంది.
స్వామివారిని నేరుగా దర్శించుకునేందుకు ఉభయ దర్శనం ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన క్యూలు, ఇతర సౌకర్యాలపై ఆలయ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!