

డ్రగ్స్ రహిత హైదరాబాద్, డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’ పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ అని పేరు పెట్టారు. అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయం నుంచి ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. కిషన్ రెడ్డి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో BJP తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు వెంకటేశ్ తదితరులు పాల్గొననున్నారు.
తొలిరోజు అంబర్‌పేట్ నుంచి ముషీరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU), గాంధీ ఆస్పత్రి మీదుగా యాత్ర సాగనుంది. అనంతరం ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వద్ద తొలిరోజు కార్యక్రమం ముగియనుండగా, అక్కడే రాత్రి బస చేయనున్నారు. విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేయడం ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!