
బిజినెస్

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు సాయంత్రం టయోటా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (FFV-SHEV) ఇన్నోవాను ఆవిష్కరించనున్నారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే సామర్థ్యం కలిగిన దేశంలోని తొలి వాహనంగా దీనిని పరిచయం చేస్తున్నారు. ఆటోమొబైల్ రంగంలో ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ ఆవిష్కరణ చాటిచెప్పనుంది.
సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఈ వాహనం కీలకంగా నిలవనుంది. టయోటా రూపొందించిన FFV-SHEV సాంకేతికతలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సామర్థ్యంతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వ్యవస్థను అనుసంధానించారు. తద్వారా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచడంతో పాటు సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశాలపై దృష్టి సారించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!