
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుకు అసలు పునాది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే వేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని అన్నారు. ఎన్నికల ముందు శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు ప్రభుత్వం భూముల సేకరణ గానీ, ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు గానీ చేయలేదని ఆయన ఆరోపించారు.
జగన్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.1,000 కోట్లతో భూముల సేకరణ పూర్తి చేసి, ప్రభావిత గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంతో పాటు అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని జీఎంఆర్‌కు ప్రాజెక్టు అప్పగించామని కొడాలి నాని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ ప్రచారం కోసమే నిర్వహించారని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!