

ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ విడుదల చేసిన 2026 గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ భారత నగరాల పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని 1,000 ప్రధాన నగరాలను ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, జీవన నాణ్యత, పర్యావరణం, పరిపాలన అనే ఐదు అంశాల ఆధారంగా ఈ సూచీ మదింపు చేసింది. జనాభా పరిమాణం, ఉత్పాదకత పెరుగుదల, ఆదాయ వృద్ధి కారణంగా చైనా, భారత నగరాలు భవిష్యత్తులో ప్రపంచ పట్టణ ఆర్థిక వృద్ధికి ముఖ్య కేంద్రాలుగా నిలిచే అవకాశం ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది.
హైదరాబాద్, ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు వంటి భారత మహానగరాలు దేశ పట్టణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరును ‘సిటీస్ టు వాచ్’ జాబితాలో చేర్చింది. ఐటీ, టెక్నాలజీ రంగాల ఆధారంగా నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు నివేదిక విశ్లేషించింది. 2050 వరకు భారతదేశంలోని పలు నగరాల జీడీపీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, మౌలిక వసతులు, జీవన నాణ్యత, పర్యావరణం వంటి అంశాల్లో సవాళ్లు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!