

మనల్ని ట్రోల్ చేసేవాళ్లు, జడ్జ్ చేసేవాళ్లు, మన గురించి మాట్లాడేవాళ్లు ఎప్పుడూ ఉంటారని చెప్పే భావన ఇప్పుడు సల్మాన్ ఖాన్ మాటల్లో కనిపించింది. ఒక దశలో ఇతరుల అభిప్రాయాల కోసం జీవించడం మానేసినప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసం వస్తుందనే సందేశం వినిపించింది. బిగ్ బాస్ 20లో సల్మాన్ ఖాన్ టీషర్ట్ విప్పి తన ఫిజిక్‌ను చూపిస్తూ, తనను ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోండి అన్నట్టుగా స్పందించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది.
ఈ సందర్భాన్ని కేవలం వినోద కార్యక్రమంలోని ఒక మూమెంట్‌గా కాకుండా, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన సందేశంగా చూస్తున్నారు. మన గురించి ఇతరులు ఏం అనుకుంటున్నారనే దానికంటే, మన గురించి మనకు ఏం తెలుసనేదే ముఖ్యమనే భావన ఇందులో కనిపిస్తోంది. అందరూ మనల్ని ఇష్టపడాలని కోరుకోవడం కాకుండా, అందరూ ఇష్టపడకపోయినా మనల్ని మనం అంగీకరించగలగడమే నిజమైన స్వేచ్ఛ అనే ఆలోచనను ఈ సందర్భం గుర్తుచేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!