
సినిమాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రాత్రి థియేటర్‌కు వెళ్లి నాని నటించిన ది పారడైజ్ సినిమాను వీక్షించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. చాలా సంవత్సరాల తర్వాత తాను సినిమా థియేటర్‌కు వెళ్లి ఒక సినిమాను చూడబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది పారడైజ్ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడనున్నారనే విషయం ఇప్పుడు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!