15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

Writer: Harika S 11:41 AM, 15 ఆగస్టు, 2026
కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. 150 కోట్లకు పైగా జనాభా, అనేక వనరులు ఉన్నప్పటికీ రహదారులు, విద్యుత్, నీరు, విద్య వంటి మౌలిక సదుపాయాల్లో దేశం ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. ఎవరి రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నా అందరం భారతీయులమేనని పేర్కొన్నారు.

దేశంలో నాయకత్వ లోపం కారణంగానే అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని కేటీఆర్ విమర్శించారు. చైనా గత నాలుగు దశాబ్దాల్లో సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, భారత్‌కు కూడా అన్ని రకాల వనరులు ఉన్నాయని అన్నారు. మెరుగైన విద్య కోసం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. మతపరమైన అంశాలపై ప్రజలు గొడవపడాలని ఏ దేవుడూ చెప్పలేదని వ్యాఖ్యానిస్తూ, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

తెలంగాణ రాజకీయాలపైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయనకు తెలంగాణ అభివృద్ధిపై ఎంతటి ఆలోచన ఉంటుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ విద్యుత్, సంక్షేమ పథకాలు, పరిపాలనా అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కొరత ఉండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని కేటీఆర్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని రాజకీయ నినాదాలతో కాకుండా వాస్తవ పనితీరుతో అంచనా వేయాలని అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కొందరు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ పార్టీ పాలనను సమర్థించారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్ కార్యకలాపాలను జిల్లాల్లో మరింత విస్తరించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయాలని సూచించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని నేతలకు చెప్పారు. తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న 26 మంది ఉద్యోగులను ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించారు. వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను కేటీఆర్ అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

35 ఏళ్లకే రిటైర్ కావాలన్న బెంగళూరు యువకుడు.. ప్లాన్‌పై నెటిజన్ల చర్చ

35 ఏళ్లకే రిటైర్ కావాలన్న బెంగళూరు యువకుడు.. ప్లాన్‌పై నెటిజన్ల చర్చ

51 ఏళ్ల వయసులో NEET క్లియర్.. భార్య సహకారంతో సక్సెస్ సాధించిన వ్యక్తి

51 ఏళ్ల వయసులో NEET క్లియర్.. భార్య సహకారంతో సక్సెస్ సాధించిన వ్యక్తి

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలుతెలంగాణ భవన్స్వాతంత్య్ర దినోత్సవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక
సినిమాలు

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్
సినిమాలు

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు
సినిమాలు

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు
క్రీడలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్
జనరల్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే
జనరల్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?
రివ్యూలు

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ఇండోనేషియాలో భారీ భూకంపం...
జనరల్

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!