

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భారీ స్థాయిలో జరుగుతున్న నిర్మాణానంతర పనుల కారణంగా సినిమా వాయిదా పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ చిత్ర బృందం కొత్త విడుదల తేదీపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
నిజానికి ‘ధర్మన్’ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కారణాలతో ఆ ప్రణాళికలో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘వారణాసి’ విడుదల వాయిదా పడితే, ఆ తేదీని తమ సినిమాకు అనుకూలంగా మార్చుకోవాలని ‘ధర్మన్’ నిర్మాతలు ఆలోచిస్తున్నారట. భారీ చిత్రాల విడుదల తేదీల్లో వచ్చే మార్పులు ఇతర సినిమాలకు అవకాశంగా మారుతున్నాయి. మరి మహేష్ బాబు సినిమా వాయిదా పడుతుందా? రజినీకాంత్ సినిమా ఆ తేదీని అందిపుచ్చుకుంటుందా? అనేది తెలియాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!