

జమ్మూకశ్మీర్‌లోని బద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ కమాండర్ మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ హాషిమ్ మూసా హతమయ్యాడు. భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అతడిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. మూసా సాధారణ ఉగ్రవాది కాదని, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎలైట్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ)లో 23 ఏళ్లపాటు పనిచేసిన మాజీ కమాండో అని వెల్లడించారు.
పాకిస్థాన్ ఆర్మీ నుంచి 2023లో రిటైర్ అయిన అనంతరం మూసా లష్కరే తోయిబా ఉగ్రవాద నెట్‌వర్క్‌లో చేరినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. 2006 నుంచి 2008 మధ్య మాజీ పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భద్రతా బృందంలోనూ అతడు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని పలు ఉగ్రదాడులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు భద్రతా సంస్థలు ఆరోపించాయి. బద్గామ్‌లో జరిగిన తాజా ఆపరేషన్ అనంతరం ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!