

స్పెయిన్‌లోని టోలెడో ప్రావిన్సులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉర్డా సమీపంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక బృందాలు ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
స్పెయిన్ రైల్వే వ్యవస్థ నిర్వాహక సంస్థ ఏడీఐఎఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాడ్రిడ్ నుంచి సెవిల్లే వైపు వెళ్తున్న రెండు రైళ్లు ఒకే మార్గంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఐరియో రైలు వెనుక భాగాన్ని రెన్ఫే సంస్థకు చెందిన మరో హైస్పీడ్ రైలు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఒక రైలులో 397 మంది, మరో రైలులో సుమారు 147 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో మాడ్రిడ్, సియుడాడ్ రియల్, అందలూసియా మధ్య హైస్పీడ్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!