

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారినే లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ పేరుతో పరిచయం పెంచుకున్న నిందితుడు, వాట్సాప్ చాటింగ్ ద్వారా సదరు అధికారికి దగ్గరై అనంతరం డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైదాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా, చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడి చేతిలో వందల మంది బాధితులు మోసపోయి ఉండొచ్చని దర్యాప్తులో గుర్తించారు. వేలాది వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బాధితులు ఉన్నారని, దుబాయ్ వంటి విదేశాల్లో నివసిస్తున్న కొందరు కూడా మోసపోయినట్లు సమాచారం అందిందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!