

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్‌ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ను గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి గ్రేహౌండ్స్ బలగాలతో కలిసి పోలీసులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న డంప్‌లో 300కు పైగా బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు (బీజీఎల్‌లు) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్థాయిలో ఆయుధాలు లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చర్ల పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద సంఖ్యలో బీజీఎల్‌లను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ అరుణ్‌కుమార్, సీఐ రాజువర్మ, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ ఏసీ విక్రమ్ రంజన్, ఎస్సై నర్సిరెడ్డి పాల్గొన్నారు. డంప్ స్వాధీనం, తదుపరి దర్యాప్తునకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!