

గతేడాది ‘తేరే ఇష్క్ మే’ సినిమా ప్రమోషన్స్ సమయంలో వైరల్ అయిన ఓ వీడియోపై నటుడు ధనుష్ తాజాగా స్పందించారు. ఆ వీడియోలో ధనుష్ నడుచుకుంటూ వెళ్తుండగా, ఆయన స్టైలిస్ట్ కావ్య శ్రీరామ్ వెనుక నుంచి వచ్చి ప్యాంటును సరిచేశారు. అయితే ఆమె వైపు చూడకుండా ధనుష్ ముందుకు వెళ్లిపోవడంతో సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేశారు. ఆయనకు స్టార్‌డమ్ తలకెక్కిందని, కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలేదని ట్రోల్ చేశారు. తన తాజా చిత్రం ‘ఓం’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఈ ఘటనపై వివరణ ఇచ్చిన ధనుష్, కావ్య తన పని పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారని ప్రశంసించారు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న పాటకు అనుగుణంగా తాను నడుస్తున్నానని, వెనుక ఆమె తన దుస్తులను సరిచేస్తున్న విషయం తనకు తెలియలేదని చెప్పారు. ఆమె కష్టానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇదే వేడుకలో మలయాళ నటుడు మమ్ముట్టిపై ధనుష్ చేసిన సరదా వ్యాఖ్యలు కూడా ప్రేక్షకులను నవ్వించాయి. మమ్ముట్టి ఎంతో యంగ్‌గా కనిపిస్తుండగా, ధనుష్ మాత్రం తెల్ల గడ్డంతో కనిపించడంపై అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ధనుష్, వచ్చే కార్యక్రమానికి వచ్చేటప్పుడు మమ్ముట్టి గడ్డంలో కొన్ని తెల్ల వెంట్రుకలైనా ఉండేలా చూసుకోవాలని చమత్కరించారు. లేదంటే ఆయన పక్కన తాను మరీ పెద్దవాడిలా కనిపిస్తున్నానని నవ్వించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘ఓం’ నవంబర్ 20న విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!