
సినిమాలు

వరంగల్ అభివృద్ధి, కేంద్ర నిధులు, ఎయిర్‌పోర్టు, ఎరువుల సరఫరా అంశాలపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఎల్కతుర్తిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
వరంగల్ ఎయిర్‌పోర్టు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. కేంద్రం నిధులు, ఎరువుల సరఫరాపై రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. బీజేపీ నేతలు వాస్తవాలు తెలియకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!