

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులపై ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. KBR పార్క్ పరిసరాల్లో కొనసాగుతున్న మౌలిక వసతుల పనుల నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు వాహనాల రాకపోకలను సులభతరం చేయడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.
వన్‌వే మార్గాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లోనూ రూట్లను అప్‌డేట్ చేయనున్నారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిబ్బందిని భారీగా మోహరించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ హెచ్చరించారు. గతంలో నిర్వహించిన ప్రయోగాత్మక వన్‌వే ట్రయల్‌లో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో లేన్ మార్పులు, జంక్షన్‌ల వద్ద రద్దీ వంటి సమస్యలను అధికారులు గుర్తించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!