
సినిమాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నారెడ్డి పీసీసీ, ఏఐసీసీపై మాట్లాడే స్థాయికి వచ్చారని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా నేతలు నిర్ణయించినట్లు తెలిపారు.
రేపు జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి వెళ్తామని మేఘారెడ్డి చెప్పారు. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేస్తామని, మీనాక్షి నటరాజన్‌కు కూడా ఈ అంశంపై ఫిర్యాదు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ చిన్నారెడ్డికి ఏం తక్కువ చేసిందని ప్రశ్నించిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డి సీనియర్ నేతలను పట్టించుకోలేదని ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!